స్విచ్‌లు లేదా ముందు వైపు కెమెరాను ఉపయోగించి మీ ఫోన్ లేదా టాబ్లెట్‌ను కంట్రోల్ చేయండి. మీరు స్విచ్‌లను ఉపయోగించి ఐటెమ్‌లను ఎంచుకోవచ్చు, స్క్రోల్ చేయవచ్చు, టెక్స్ట్‌ను ఎంటర్ చేయవచ్చు, ఇంకా మరెన్నో చేయవచ్చు.
టచ్‌స్క్రీన్‌కు బదులుగా ఒకటి లేదా అంత కంటే ఎక్కువ స్విచ్‌లను ఉపయోగించి మీ Android పరికరంతో ఇంటరాక్ట్ అయ్యేలా స్విచ్ యాక్సెస్ మీకు సహాయపడుతుంది. మీరు మీ పరికరంతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నట్లయితే, స్విచ్ యాక్సెస్ సహాయపడుతుంది.
ప్రారంభించడానికి:
1. మీ పరికరానికి చెందిన సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
2. యాక్సెసిబిలిటీ > స్విచ్ యాక్సెస్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
స్విచ్‌ను సెటప్ చేయండి
స్విచ్ యాక్సెస్ మీ స్క్రీన్‌పై ఉండే ఐటెమ్‌లను స్కాన్ చేసి, మీరు ఎంపిక చేసే వరకు ప్రతి ఐటెమ్‌ను హైలైట్ చేస్తుంది. మీరు కింద పేర్కొన్న కొన్ని రకాల స్విచ్‌ల నుండి ఎంచుకోవచ్చు:
భౌతిక స్విచ్‌లు
• బటన్‌లు లేదా కీబోర్డ్‌ల వంటి, USB లేదా బ్లూటూత్ స్విచ్‌లు
• వాల్యూమ్ బటన్‌ల వంటి పరికరంలో స్విచ్‌లు
కెమెరా స్విచ్‌లు
• మీ నోరు తెరవండి, నవ్వండి లేదా కనుబొమ్మలు పైకి లేపండి
• ఎడమ వైపునకు, కుడి వైపునకు లేదా పైకి చూడండి
మీ పరికరాన్ని స్కాన్ చేయండి
స్విచ్‌ను సెటప్ చేసిన తర్వాత, స్క్రీన్‌పై ఉన్న వాటిని మీరు స్కాన్ చేయవచ్చు, వాటితో ఇంటరాక్ట్ కావచ్చు.
• రేఖీయ స్కానింగ్: ఐటెమ్‌లను ఒక్కొక్కటిగా స్క్రోల్ చేయండి.
• అడ్డు వరుస-నిలువు వరుస స్కానింగ్: ఒక్కొక్క అడ్డు వరుసను స్కాన్ చేయండి. అడ్డు వరుసను ఎంచుకున్న తర్వాత, ఆ లిస్ట్‌లోని ఐటెమ్‌లను స్క్రోల్ చేయండి.
• పాయింట్ స్కానింగ్: ఒక నిర్దిష్ట హారిజాంటల్, వర్టికల్ లొకేషన్‌ను ఎంచుకోవడానికి కదిలే లైన్‌లను ఉపయోగించండి, ఆపై "ఎంచుకోండి"ని నొక్కండి.
• గ్రూప్ ఎంపిక: వేర్వేరు రంగుల గ్రూప్‌లకు స్విచ్‌లను కేటాయించండి. స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌లన్నింటికి రంగు కేటాయించబడుతుంది. మీకు కావలసిన ఐటెమ్‌కు చుట్టూ ఉన్న రంగుకు సంబంధించిన స్విచ్‌ను నొక్కండి. మీకు కావలసిన ఎంపికకు చేరుకొనేంత వరకు గ్రూప్ సైజ్‌ను తగ్గించండి.
మెనూలను ఉపయోగించండి
ఒక ఎలిమెంట్‌ను ఎంచుకున్నప్పుడు, ఎంపిక, స్క్రోల్, కాపీ, పేస్ట్ వంటి మరెన్నో అందుబాటులో ఉన్న ఇంటరాక్షన్‌లు మీకు కనిపిస్తాయి.
మీ పరికరంలో చుట్టూ కదలడానికి సహాయపడే మెనూ కూడా స్క్రీన్‌కు ఎగువున ఉంటుంది. ఉదాహరణకు, మీరు నోటిఫికేషన్‌లను తెరిచి, మొదటి స్క్రీన్‌కు వెళ్లి, వాల్యూమ్‌ను మార్చి, మరెన్నో చేయవచ్చు.
కెమెరా స్విచ్‌లతో నావిగేట్ చేయండి
మీరు కెమెరా స్విచ్‌లను ఉపయోగించి, ముఖ సంజ్ఞలతో మీ ఫోన్‌ను నావిగేట్ చేయవచ్చు. మీ ఫోన్ ముందు వైపు కెమెరాను ఉపయోగించి మీ ఫోన్‌లో బ్రౌజ్ చేయండి లేదా యాప్‌లను ఎంచుకోండి.
మీ అవసరాలకు తగినట్లుగా మీరు ప్రతి సంజ్ఞ యొక్క రంగు ప్రకాశ స్థాయిని, వ్యవధిని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు.
షార్ట్‌కట్‌లను రికార్డ్ చేయండి
స్విచ్‌కు కేటాయించగల లేదా మెనూ నుండి ప్రారంభించగల తాకే సంజ్ఞలను మీరు రికార్డ్ చేయవచ్చు. తాకే సంజ్ఞలలో వేళ్లతో స్క్రీన్‌ను నియంత్రించడం, జూమ్ చేయడం, స్క్రోల్ చేయడం, స్వైప్ చేయడం, డబుల్ ట్యాప్ చేయడం, ఇంకా మరిన్ని ఉండవచ్చు. ఆపై మీరు తరచుగా చేసే లేదా సంక్లిష్టమైన చర్యలను ఒకే స్విచ్‌తో ప్రారంభించవచ్చు, ఉదాహరణకు, ఈ-బుక్‌లో రెండు పేజీలను తిప్పడానికి రెండు సార్లు ఎడమ వైపునకు స్వైప్ చేసే సంజ్ఞను రికార్డ్ చేయడం.
అనుమతుల నోటీసు
• యాక్సెసిబిలిటీ సర్వీస్: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సర్వీస్ కాబట్టి, ఇది మీ చర్యలను గమనించగలదు, విండో కంటెంట్‌ను తిరిగి పొందగలదు, అలాగే మీరు టైప్ చేసే టెక్స్ట్‌ను గమనించగలదు.
అప్‌డేట్ అయినది
21 ఆగ, 2024