Microsoft To Do అన్నది మీ రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం మీకు సహాయపడే సులభమైన మరియు తెలివైన చేయాల్సిన-పని జాబితా. కార్యాలయం, పాఠశాల లేదా ఇల్లు, అవసరం ఏదైనా కూడా, మీ ఉత్పాదకతను పెంచి, మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో To Do మీకు సహాయపడుతుంది. మీ రోజువారీ పనులను సులభంగా ప్లాన్ చేసుకోవడం కోసం ఇందులో తెలివైన సాంకేతికత మరియు అందమైన డిజైన్ ఉంది.
మీ రోజువారీ పనులను క్రమబద్ధం చేసుకుని, ప్లాన్ చేయండి
మీ To Do యొక్క స్మార్ట్ సూచనలను క్రమబద్ధం చేసుకుని, మీరు రోజువారీ చేయాల్సిన ముఖ్యమైన విధులు లేదా పనులను పూర్తి చేయండి. To Do మీ ఫోన్ మరియు కంప్యూటర్ మధ్య సమకాలీకరిస్తుంది, కనుక మీరు మీ చేయాల్సిన పనిని పాఠశాల, కార్యాలయం లేదా సరుకుల దుకాణం లేదా మీరు ప్రపంచంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా యాక్సేస్ చేయగలరు.
మీ జాబితాలను కుటుంబ సభ్యులు మరియు సహోద్యోగులతో భాగస్వామ్యం చేయండి
జాబితా భాగస్వామ్యం ద్వారా మీరు ఉమ్మడి జాబితాలు మరియు విధులలో కలిసి పని చేయవచ్చు మరియు మీ లక్ష్యాలను అవాంతరాలు లేకుండా చేరుకోవచ్చు. మీరు మీ బృందాలతో కార్యాలయ పనుల జాబితా భాగస్వామ్యం చేస్తున్నా లేదా మీ భాగస్వామితో సరుకుల జాబితాని భాగస్వామ్యం చేస్తున్నా, మా భాగస్వామ్య లింక్‌తో, మీరు సులభంగా చిన్న బృందాలతో మరియు ముఖాముఖిగా సమన్వయం చేసుకుని, కలిసి పని చేయవచ్చు. పనులను మునుపటి కంటే సులభంగా పూర్తి చేయవచ్చు!
మీ విధిని చిన్న, పూర్తి చేయాల్సిన అంశాలుగా విభజించండి
దశలు (ఉపవిధులు) ఉపయోగించి మీరు పనలను చిన్న, మరింత సులభంగా పూర్తి చేయగల భాగాలుగా చేయవచ్చు. కస్టమర్‌ల ఉత్పాదకతను పెంచడంలో సహాయపడటం కోసం, ప్రతి చేయాల్సిన-పని అందులో ఎన్ని దశలు (ఉపవిధులు) ఉన్నాయో మరియు ఇప్పటి వరకు ఎన్ని దశలు పూర్తయ్యాయో చూపుతుంది. దశలు (ఉపవిధులు) ఉన్న చేయాల్సిన-పనిని పూర్తయినట్లు లేదా పూర్తి కానట్లు మీరు గుర్తు పెట్టినా కూడా అవి వాటి సంపూర్ణతా స్థితిని కలిగి ఉంటాయి.
గడువు తేదీలు మరియు రిమైండర్‌లను సెట్ చేయండి
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ చేయాల్సిన పనులను త్వరగా జోడించవచ్చు, క్రమబద్ధం చేయవచ్చు మరియు షెడ్యూల్ చేయవచ్చు. మీకు నిజంగా ముఖ్యమైన చేయాల్సిన-పనుల కోసం మీరు రిమైండర్‌లను మరియు గడువు తేదీలను జోడించడం ద్వారా ఎప్పటికీ వాటికి మర్చిపోకుండా ఉండవచ్చు—వాటిని మేము మీకు గుర్తు చేస్తాము. మీరు రోజువారీ, వారంవారీ లేదా సంవత్సరం వారీ చేయాల్సిన-పనులను జోడించదలచుకుంటే, ప్రతిదీ, ప్రతిసారీ మీకు గుర్తు చేసే విధంగా మీరు పునరావృత గడువు తేదీలను సెటప్ చేయవచ్చు.
మీ విధులకు గమనికలను జోడించండి
మీరు To Doని గమనికను వ్రాసుకోగల యాప్ లాగా కూడా ఉపయోగించవచ్చు, ఆపై ప్రతి చేయాల్సిన-పనిలో వివరణాత్మక గమనికలను జోడించవచ్చు—చిరునామాల నుండి మీరు చదవాలనుకుంటున్న పుస్తకం, మీకు ఇష్టమైన కెఫే యొక్క వెబ్‌సైట్ వంటి అన్నింటినీ జోడించవచ్చు. మీరు మరిన్ని పనులను పూర్తి చేయడంలో సహాయపడే విధంగా మీ విధులు మరియు గమనికలన్నింటినీ ఒకే స్థలంలో సేకరించవచ్చు.
Outlook ఏకీకరణ
Outlook మెయిల్ ఏకీకరణతో, మీరు ఒకే Microsoft ఖాతాని ఉపయోగించి మీ Outlook డెస్క్‌టాప్ క్లయింట్ లేదా Outlook.comలో మీ విధులనూ చూడవచ్చు. చేయాల్సిన-పనులు అన్నీ Exchange Online సర్వర్‌లలో నిల్వ చేయబడతాయి, కనుక అవి Microsoft To Do మరియు Outlook టాస్క్‌లు రెండింటిలోనూ స్వయంచాలకంగా చూపబడతాయి.
ప్రతి ఉదయం మీరు దేనిపై దృష్టి ఉంచాలో ఎంచుకోండి మరియు రోజువారీ పనులను మెరుగైన ఉత్పాదకతతో పూర్తి చేయడంలో మీకు సహాయపడేలా శక్తిని పొందండి. సరళమైన చేయాల్సిన-పని జాబితా యాప్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని, ఉపయోగించవచ్చు. ఇందులో అనుకూలీకరించగల థీమ్‌లు, గమనికలు, రిమైండర్‌లు, గడువు తేదీలు, స్మార్ట్ సూచనలు మరియు వివిధ పరికరాలలో సమకాలీకరించడం వంటివి ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు మీ జీవితంలోని అన్నింటినీ నిర్వహించవచ్చు, పూర్తి చేయవచ్చు. మీ విధులు లేదా పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. ఇది మీరు మీ రోజువారీ పనులకు జోడించాల్సిన విధి నిర్వహణ సాధనం.
మరింత తెలుసుకోండి: http://to-do.microsoft.com
మమ్మల్ని అనుసరించండి: https://twitter.com/MicrosoftToDo
ఆలోచన లేదా భవిష్యత్తు సూచన: https://todo.uservoice.com/
మద్దతు కావాలి: https://todosupport.microsoft.com/support?product_id=todo
Microsoft To Doని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, మీరు ఈ వినియోగ నిబంధనలకు అంగీకరిస్తున్నారు: https://go.microsoft.com/fwlink/?linkid=842577
అప్‌డేట్ అయినది
29 అక్టో, 2024