what3wordsని వాడి నిర్దిష్టమైన ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చు. ప్రతి 3 మీటర్ల చదరానికి what3words ఒక ప్రత్యేకమైన 3 పదాల కలయికని కేటాయించింది: ఇది ఒక what3words చిరునామా. ఇప్పుడు మీరు కేవలం 3 సులువైన పదాలతో ఖచ్చితమైన స్థానాలను కనుక్కుని నావిగేట్ చేయవచ్చు, పంచుకోవచ్చు.
what3wordsని ఇలా ఉపయోగించండి:
- కేవలం 3 పదాలతో ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా దారి తెలుసుకోండి.
- ఖచ్చితమైన సమావేశ స్థానాలను ఏర్పాటు చేసుకోండి.
- మీ ఇల్లు, వ్యాపారం, లేదా ఎయిర్ బి.ఎన్.బి. ప్రవేశాన్ని కనుక్కోవడంలో ఇతరులకు సహాయపడండి.
- ఎప్పుడూ మీ పార్కింగ్ స్థానానికి దారి మరచిపోకండి.
- పనికి సంబంధించన ముఖ్యమైన స్థానాలను (సంఘటన నివేదన, డెలివరీలు చేరే ద్వారాలు మొదలైనవి) సేవ్ చేసుకోండి.
- మీకు తీపి గుర్తులైన స్థానాలను సేవ్ చేసుకోండి: సూర్యాస్తమయం జరిగే చోటు, మీకు నిశ్చితార్థం జరిగిన చోటు, మీకు ఇష్టమైన కిరాణా కొట్టైనా సరే.
- నిర్దిష్టమైన ప్రవేశాలకు ఇతరులకు దారి చూపించండి.
- అత్యవసర సేవలు అందించే వారికి మిమ్మల్ని కనుక్కోవడంలో సహాయపడండి.
- సరైన చిరునామా లేని మారుమూల ప్రదేశాలను కూడా కనుక్కోండి.
ట్రావెల్ గైడ్‌లు, వెబ్సైట్‌ల సంప్రదింపు సమాచార పేజీలు, ఆహ్వానాలు, ట్రావెల్ బుకింగ్ ధృవీకరణలు – ఇలా స్థానానికి సంబంధించిన సమాచారం దొరికే ఏ చోటైనా మీరు what3words చిరునామాలను చూడవచ్చు. మీ స్నేహితులు మిమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానిస్తే, వారి what3words చిరునామాని మీతో పంచుకోమని చెప్పండి.
ప్రసిద్ధమైన అంశాలు:
- Google Maps లాంటి నావిగేషన్ యాప్స్‌తో అనుకూలత
- మీకు ఇష్టమైన స్థానాలను సేవ్ చేసి జాబితాలు తయారుచేసుకోండి
- ఆటోసజెస్ట్ మీకు ఎప్పటికప్పుడు తెలివైన సలహాలు ఇస్తూ ఉంటుంది
- హిందీ, మరాఠీ, తమిళం మొదలైన 12 భారతీయ భాషలతో సహా 50 భాషలలో లభ్యం
- కంపస్ మోడ్ వాడి ఆఫ్‌లైన్‌లో కూడా నావిగేట్ చేయవచ్చు
- డార్క్ మోడ్ మద్దతు
- ఫోటోలకు what3words చిరునామాని జత చేయండి
- Wear OS
మీకు సమస్యలు ఎదురైనా, ప్రశ్నలున్నా,
[email protected]కి ఈమెయిల్ చేయండి